సీ.
కాటిలో
నెందుకు కాపురము శివుడా
కూర్చొమ్ము నాగుండె గూటిలోన
మేటిదేవర నీకు మెడలోన పామేల
నాభక్తి ముత్యాల నగను గొనుము
సాటిలేనీ శూలి సామజం తోలేల
సితమైన మనసిత్తు సిరిగ కట్టు
కూటికోసము కాలకూటమెందుకుసామి
ఆత్మనివేదన మారగించు
తే. పరమపదమగు పదము శ్రీపతి కొలిచెడి
పదము సకల సురవరులు పట్టు పదము
అన్నపూర్ణకు
నిజనిలయపదము భవ
కడలి
దాటించు కాలారి కరుణ పదము